Andhra Pradesh: 18న బంగాళాఖాతంలో అల్పపీడనం.. 16 నుంచే కోస్తాలో వర్షాలు

  • ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • రాయలసీమ, కోస్తాలో చెదురుమదురు వర్షాలు
  • మరో 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వానలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 18న అల్పపీడనం ఏర్పడబోతోందని, దాని ప్రభావంతో రెండు రోజుల ముందు నుంచే కోస్తాలో వర్షాలు ప్రారంభం అవుతాయని రియల్ టైమ్ గవర్నెన్స్ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణ, కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, కర్ణాటక నుంచి కొమరన్‌ తీరం వరకు ద్రోణి కూడా ఏర్పడింది.

వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16 నాటికి మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, 18 నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Andhra Pradesh
Bay Of Bengal
Rain
Kosta
Rayalaseema
  • Loading...

More Telugu News