Kosaraju Bhanuprasad: టాలీవుడ్ సీనియర్ నిర్మాత కొసరాజు భానుప్రసాద్ కన్నుమూత.. సినీ ప్రముఖుల నివాళి

  • అనారోగ్యంతో బాధపడుతున్న భానుప్రసాద్
  • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూత
  • సినీ ప్రముఖుల నివాళి

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రసిద్ధ రచయిత కొసరాజు కుమారుడు, టాలీవుడ్ నిర్మాత కొసరాజు భానుప్రసాద్ (84) చెన్నైలో కన్నుమూశారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు సంధ్య, అనురాధ, కుమారుడు రంజన్ ఉన్నారు. భార్య శ్యామల రెండేళ్ల క్రితమే మృతి చెందారు.

నేటి ఉదయం 10 గంటలకు స్థానిక బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో భానుప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 26 ఏళ్ల వయసులోనే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన భానుప్రసాద్.. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలిలో కార్యవర్గ సభ్యుడిగానూ సేవలందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పలు సినిమాలు నిర్మించారు. భానుప్రసాద్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Kosaraju Bhanuprasad
Producer
Tamilnadu
Chennai
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News