nawaz shariff: కుల్సుమ్, ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు!: భార్యతో నవాజ్ షరీఫ్ చివరి మాటలు

  • ‘కుల్సుమ్ కళ్లు తెరువు.. అల్లా నీకు శక్తిని ప్రసాదిస్తాడు’
  • నవాజ్ షరీఫ్ చివరిసారి ఆమెను కలిసినప్పటి వీడియో
  • సామాజిక మాధ్యమాలకు చేరిన వైనం

పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి బేగం కుల్సుమ్ నవాజ్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చి.. లాహోర్ లోని నవాజ్ కుటుంబానికి సంబంధించిన నివాసంలో ఖననం చేయనున్నట్టు సమాచారం. అవినీతి ఆరోపణల కేసులో నవాజ్ షరీఫ్, కూతురు మర్యమ్, అల్లుడు మహమ్మద్ సఫ్దార్ లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, కుల్సుమ్ అంత్యక్రియల నిమిత్తం పెరోల్ పై వారు జైలు నుంచి విడుదలయ్యారు.

కాగా, గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడిన కుల్సుమ్ లండన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అయితే, నవాజ్ షరీఫ్ తన భార్యను చివరిసారిగా చూసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరింది. నవాజ్ జైలుకు వెళ్లడానికి ముందు చివరిసారి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పలకరించారు.

ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న తన భార్యతో ‘కుల్సుమ్ కళ్లు తెరువు..ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు.. అల్లా నీకు శక్తిని ప్రసాదిస్తాడు’ అని నవాజ్ అంటుండటం ఆ వీడియోలో మనం గమనించవచ్చు. ఇదిలా ఉండగా, తన భార్యను కళ్లు తెరవమని అన్నప్పుడు ఆమె కొన్ని సెకన్ల పాటు కళ్ళు తెరిచారని నవాజ్ షరీఫ్ తన కుటుంబసభ్యులతో చెప్పారట.

nawaz shariff
kulsum
  • Error fetching data: Network response was not ok

More Telugu News