jagan: వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జగన్, రఘువీరారెడ్డి

  • ఇరు రాష్ట్రాలకు విఘ్నేశ్వరుడి దీవెనలుండాలి
  • రెండు రాష్ట్రాల ప్రజలకు విజయాలు సిద్ధించాలి: జగన్
  • ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ఏపీసీసీ అధ్యక్షుడు

రేపు వినాయక చవితి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధి పరంగా ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగిపోవాలని, అనేక విజయాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అలాగే, వినాయక చవితి సందర్భంగా ఏపీసీసీ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

jagan
raghuveera reddy
  • Loading...

More Telugu News