ram vilas pashwan: అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిందే: రాంవిలాస్‌ పాశ్వాన్‌

  • ఓపెన్‌ కేటగిరీకి 15 శాతం కేటాయించాలి
  • తమిళనాడు తరహాలో అమలు చేయొచ్చు
  • రాజకీయ పక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వస్తే సాధ్యమే

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, రాజకీయపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే ఇది సాధ్యమేనని ప్రముఖ దళిత నాయకుడు, కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ అన్నారు. ఓపెన్‌ కేటగిరీకి 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే సముచితంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రిజర్వేషన్లు 50 శాతం దాటరాదన్న సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్‌లు అమలవుతున్నాయి కదా, ఇదీ అలాగే అన్నారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదిస్తే ఓసీలకు రిజర్వేషన్లు సాధ్యమేనని చెప్పారు.

రాజకీయ పక్షాలన్నీ ఏకాభిప్రాయానికి రావడమే ఇందుకు కీలకమని వ్యాఖ్యానించారు. అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల వల్ల పార్టీకి అగ్రవర్ణాలు దూరం కాలేదన్నారు. పైగా బీజేపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం అన్నివర్గాల్లో ఏర్పడిందని చెప్పారు.

ram vilas pashwan
BJP
Narendra Modi
  • Loading...

More Telugu News