naga chaitanya: మా నాన్న వయసు తగ్గిపోతోంది.. అదే నాకు సమస్య: అక్కినేని నాగ చైతన్య

  • మారుతి, నాగచైతన్య కాంబోలో ‘శైలజారెడ్డి అల్లుడు’
  • 13న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
  • ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులతో ముచ్చటించిన చైతు

డైరెక్టర్ మారుతి, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, శైలజారెడ్డిగా రమ్యకృష్ణ అలరించనున్నారు. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా చైతు ట్విట్టర్ ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న.. చైతు చెప్పిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దేవదాస్ సినిమాలో నాగార్జున స్టిల్ ఒకటి పోస్ట్ చేసిన అభిమాని ‘ఈ పిక్ గురించి ఒక్కమాట’ అని చైతుని అడిగాడు. దీనికి చైతూ చెబుతూ, ‘‘రోజు రోజుకూ ఆయన వయస్సు తగ్గిపోతోంది. అదే నాకు పెద్ద సమస్య’’ అని ఫన్నీగా సమాధానమిచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు సరదా సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 

naga chaitanya
nagarjuna
anu emmanuel
ramya krishna
director maruthi
  • Loading...

More Telugu News