ys jagan: ‘నవరత్నాలు’ అధికారిక పోస్టర్ విడుదల చేసిన జగన్

  • విశాఖలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
  • వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ‘నవరత్నాలు’ పోస్టర్  
  • ‘నవరత్నాలు’ గురించి ఇంటింటికీ చెప్పాలన్న జగన్

 ప్రజలకు వైసీపీ ఇచ్చిన హామీలు ‘నవరత్నాలు’ పోస్టర్ ను అధినేత జగన్ ఈరోజు ఆవిష్కరించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖపట్టణంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ ఈరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘నవరత్నాలు’ అధికారిక పోస్టర్ ను జగన్ విడుదల చేశారు.

వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఈ పోస్టర్ అందుబాటులో ఉంటుందని, ప్రతి కార్యకర్త దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని జగన్ అన్నారు. ఇంటింటికీ నవరత్నాలు’ చేర్చాల్సిన బాధ్యత ప్రతికార్యకర్తపైనా ఉందని, అలా అయితేనే, కపటబుద్ధిగల చంద్రబాబు ప్రలోభాలను అడ్డుకోగలమని అన్నారు. ‘నవరత్నాలు’ తో కలిగే మేలును ప్రతీ కుటుంబానికి వివరించి చెప్పాలని తమ నాయకులు, కార్యకర్తలకు జగన్ పిలుపు నిచ్చారు.

ys jagan
navaratnalu
poster
  • Loading...

More Telugu News