nizam museum: కోట్ల విలువైన నిజాంల టిఫిన్ బాక్సుతో దొంగలు ఏం చేశారంటే..!
- నిజాం మ్యూజియంలో ఈ నెల 2న చోరీ
- కోట్ల విలువైన టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, స్పూన్ చోరీ
- టిఫిన్ బాక్స్ లో ప్రతి రోజు తిండి తిన్న ఓ దొంగ
హైదరాబాదులోని పురానా హవేలీలో ఉన్న నిజాం మ్యూజియంలో ఈ నెల 2వ తేదీన చోరీ జరిగిన సంగతి తెలిసిందే. కోట్ల విలువైన టిఫిన్ బాక్స్, వజ్రాలు, కెంపులు పొదిగిన కప్పు, సాసర్, స్పూన్ లను ఇద్దరు దొంగలు చోరీ చేశారు. వీరిని పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసులు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు గుల్బర్గలో ఉన్న దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
వీటిని దొంగిలించిన తర్వాత దొంగలిద్దరూ ముంబై వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. కోట్ల విలువైన టిఫిన్ బాక్స్ ను ఓ దొంగ ప్రతి రోజు తిండి తినడానికి ఉపయోగించాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. చోరీకి గురైన వస్తువులన్నింటినీ రికవరీ చేసినట్టు తెలిపారు.