Lawyer: సుప్రీంకోర్టులోనే మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులు.. యువ న్యాయవాది అరెస్ట్!

  • సుప్రీంకోర్టులోనే రెండుసార్లు వేధించిన నిందితుడు
  • ఫిర్యాదు చేసిన నెలరోజుల తర్వాత అరెస్ట్
  • నెల రోజుల వ్యవధిలో రెండు ఘటనలు

సుప్రీంకోర్టు ఆవరణలోనే ఓ మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించిన లాయర్‌ను ఢిల్లీ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడు తనను రెండుసార్లు వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు తెలిపింది. జూలై 12న సుప్రీంకోర్టు బయట, జూలై 27న కోర్టు లోపల న్యాయవాది తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

గతనెల 14న కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా 32 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నాక నిందితుడిని అరెస్ట్ చేయడానికి నెల రోజుల సమయం ఎందుకు పట్టిందన్న దానిపై డీసీపీ మధుర్ వర్మ బార్ అండ్ బెంచ్‌కు సమాధానం ఇస్తూ జర్నలిస్టు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, అయితే.. సాక్షుల విచారణ, వారి వాంగ్మూలాన్ని రికార్డు చేయడం వల్ల అరెస్ట్ ఆలస్యమైందని తెలిపారు.

 సుప్రీంకోర్టులో మహిళలపై వేధింపులు జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. నెల రోజుల క్రితం లా క్లర్క్ ఒకాయన తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ యువ మహిళా లాయర్ ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Lawyer
Supreme Court
Journalist
Molest
New Delhi
  • Loading...

More Telugu News