Jagga Reddy: జగ్గారెడ్డి అరెస్ట్‌‌కు నిరసనగా సంగారెడ్డి బంద్.. కక్ష సాధింపన్న ఉత్తమ్

  • అరెస్ట్ అక్రమమన్న కాంగ్రెస్
  • పోలీసులు సివిల్ డ్రెస్ లో రావడంపై ఉత్తమ్ సీరియస్  
  • 2004 నుంచీ ఏం చేశారంటూ ప్రశ్న 

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్ రెడ్డి) అరెస్టుకు నిరసనగా నేడు సంగారెడ్డి బంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. భార్యా పిల్లల స్థానంలో వేరేవారిని అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వదిలి వచ్చిన ఆరోపణలపై సోమవారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను ఖండించిన కాంగ్రెస్ నేతలు మంగళవారం సంగారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు.

జగ్గారెడ్డి అరెస్ట్‌ను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డిని పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 2004లో తప్పుడు పత్రాలు సమర్పిస్తే అధికారులు ఇప్పటి వరకు ఏం చేశారని నిలదీశారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని ఆరోపించారు.

Jagga Reddy
Hyderabad
Sangareddy District
TPCC
Uttam Kumar Reddy
  • Loading...

More Telugu News