Antonov: చైనా నుంచి చెన్నైకు వచ్చిన అతిపెద్ద విమానం!
- చైనా నుంచి 53.56 టన్నుల సరుకులతో వచ్చిన విమానం
- ప్రపంచంలోని అతిపెద్ద విమానాల్లో ఒకటి
- పొడవు 69.1 మీటర్లు
చెన్నై విమానాశ్రయంలో ల్యాండైన అతిపెద్ద విమానం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటైన ‘ఆంటోనోవ్ ఏఎన్-124’ సోమవారం మధ్యాహ్నం చెన్నై ఎయిర్‌పోర్టులో ల్యాండైంది. రష్యాలోని ఓల్లా-డ్నిపేర్ సంస్థకు చెందిన ఈ విమానం చైనాలోని జియాంగ్ నుంచి 53.56 టన్నుల సరుకులతో బయలుదేరి చెన్నై వచ్చింది.
‘ఆంటోనోవ్ ఏఎన్-124’ విమానం పొడవు 69.1 మీటర్లు. రెండువైపులా రెక్కలను కలుపుకుంటే 73.3 మీటర్లు. విమానం గరిష్టంగా 150 టన్నుల బరువును మోసుకెళ్లగలదు. ప్రస్తుతం విమానాశ్రయంలో ఉన్న ఈ విమానాన్ని చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.