R.krishnaiah: పార్టీ మారారన్న వార్తలపై స్పందించిన ఆర్.కృష్ణయ్య

  • తానింకా టీడీపీలోనే ఉన్నానన్న కృష్ణయ్య
  • ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి

తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా లేరు.. పార్టీ మారారు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌.క‌ృష్ణయ్యపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ సిద్ధార్థ హోటల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన 112 బీసీ కులాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన  అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

 ఈ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈసారి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని అభ్యర్థనలు వస్తున్నాయని దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. 

R.krishnaiah
hyderabad
Telugudesam
  • Loading...

More Telugu News