Konda Surekha: ఈ నెల 23 వరకూ వేచి చూద్దామంటున్న కొండా సురేఖ దంపతులు!

  • తమ అనుచరులతో  కొండా సురేఖ దంపతుల భేటీ
  • టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి స్పందన కోసం చూద్దాం
  • పార్టీకి రాజీనామా చేయాలని సూచించిన అనుచరులు

ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూద్దామని, అప్పటికీ టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి స్పందన రాకపోతే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కొండా సురేఖ దంపతులు తమ అనుచరులతో అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం లభించకపోవడంపై కొండా సురేఖ, కొండా మురళీ అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో హన్మకొండలోని రామ్ నగర్ లో తమ అనుచరులతో వారు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ అధిష్ఠానం తమకు టికెట్లు ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టడం, అనంతర పరిణామాల గురించి తమ కార్యకర్తలతో చర్చించినట్టు సమాచారం. కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలని వారికి కార్యకర్తలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు తమ అనుచరులతో పై వ్యాఖ్యలు చేశారు.

Konda Surekha
hanam konda
  • Loading...

More Telugu News