rupee: వంద కొట్టేదాకా ఆగదా?.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైన రూపాయి!
- కొనసాగుతున్న రూపాయి పతనం
- ఈ రోజు రూ.72.61కి చేరుకుని రికార్డు
- ఆల్ టైం కనిష్టానికి చేరుకున్న రూపాయి
అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతోంది. ముడిచమురు ధరలతో పాటు డాలర్ కు డిమాండ్ పెరగడంతో ఈ రోజు ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో రూపాయి విలువ రూ.72.61కు పడిపోయింది. చమురు సెగ, డాలర్ కు డిమాండ్ కు తోడు కరెంట్ ఖాతా లోటు కారణంగా రూపాయి సోమవారం ఏకంగా 88 పైసలు నష్టపోయింది. దీంతో రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరుకుని రికార్డు సృష్టించింది. నిన్నటి సెషన్ లో రూ.71.73 వద్ద రూపాయి ట్రేడింగ్ ఆగిపోయింది. తాజాగా ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో భారత కరెన్సీ మరింత పతనమైంది. దేశ చరిత్రలో రూపాయి ఇంత కనిష్ట స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి.