Rahul Gandhi: కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ బంద్!
- పెట్రో ధరల మంటపై విపక్షాలు బంద్‌కు పిలుపు
- దేశవ్యాప్తంగా పలు రూపాల్లో కార్యకర్తల నిరసన
- ముంబయిలో నిలిచిపోయిన లోకల్ రైళ్లు
పెట్రో మంటలు చల్లార్చడంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీహార్‌లో ఎల్‌జేడీ కార్యకర్తలు రైల్ రోకో నిర్వహించారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గుజరాత్‌లోనూ విపక్ష పార్టీలన్నీ భారీ ర్యాలీ నిర్వహించాయి. కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. ముంబయిలో బంద్ కారణంగా లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. భారత్ బంద్‌లో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ (ఎస్) సహా మొత్తం 21 పార్టీలు పాల్గొన్నాయి.