devineni Uma: వసంత నాగేశ్వరరావు ఫోన్ బెదిరింపులపై చంద్రబాబు సీరియస్!

  • ఇది చాలా తీవ్రమైన విషయమన్న చంద్రబాబు
  • ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించినా.. కఠిన చర్యలు తప్పవు
  • ఇలాంటి బెదిరింపులను సహించం

మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును హత్య చేస్తామనే రీతిలో వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి బెదిరించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెస్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

ఓ మంత్రిని హత్య చేస్తామనే ధోరణిలో వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎవరు ప్రోత్సహించినా తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులను సహించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ సందర్భంగా, ఇప్పటికే వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదైందని చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు.

devineni Uma
Chandrababu
vasantha nageswara rao
  • Loading...

More Telugu News