TRS: టీఆర్ఎస్ కు షాకిచ్చిన చేవెళ్ల నేత కేఎస్ రత్నం!

  • చేవెళ్ల టికెట్ ఆశించి భంగపడ్డ కేఎస్ రత్నం
  • ఉత్తమ్ కుమార్ రెడ్డితో మంతనాలు
  • త్వరలో కాంగ్రెస్ లో చేరిక!

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ను ఆశించి భంగపడ్డ కేఎస్ రత్నం, టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. చేవెళ్ల టికెట్ ను ఆశిస్తున్న ఆయన, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది.

 కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉత్తమ్ ఆహ్వానించడంతోనే రత్నం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి తాను సేవ చేస్తున్నా, పరిగణనలోకి తీసుకోలేదని రత్నం, తన అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. కాగా, కేఎస్ రత్నం ఎప్పుడు పార్టీలో చేరుతారన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

TRS
Congress
KS Ratnam
  • Loading...

More Telugu News