Telangana: అన్ని నియోజకవర్గాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తాం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

  • వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోం
  • తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తాం
  • ఈ నెల 15న పాలమూరులో బహిరంగ సభ

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, టికెట్ల కేటాయింపుపై దృష్టి సారించమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.

తొలి విడతగా యాభై నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 15న పాలమూరులో బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు అమిత్ షా హాజరవుతారని, సభ ముగిసిన తర్వాత తమ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులు జరుగుతాయని చెప్పారు.

Telangana
bjp
laxman
  • Loading...

More Telugu News