curiosity rover: అబ్బురపరిచే ఫోటోను క్లిక్‌మనిపించిన ‘క్యూరియాసిటీ’
- మార్స్ ఉపరితలానికి చెందిన 360 డిగ్రీల పనోరమిక్ వ్యూ ఫోటో తీసిన క్యూరియాసిటీ రోవర్
- దుమ్ము తుపాన్ కారణంగా ఎర్రగా కనిపిస్తోన్న ఆకాశం
- ఉపరితల కఠినం కారణంగా డ్రిల్లింగ్‌ను ఆపేసిన రోవర్
అంగారకుడిపై పరిశోధన కోసం నాసా క్యూరియాసిటీ రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అంగారకుడిపై తవ్వకాలు జరిపి అక్కడి శిలల చిత్రాలను, పరిశోధన డేటాను భూమిపైకి పంపించింది. ప్రస్తుతం ఉపరితలం కొంచెం కఠినంగా ఉండటంతో డ్రిల్లింగ్‌ను ఆపేసింది. ఈ కఠినత్వానికి కారణాలను నాసా శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు.
ఈ రోవర్ ఇప్పటి వరకూ ఎన్నో ఫోటోలను తీసింది. కానీ తాజాగా తీసిన ఫొటో చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం క్యూరియాసిటీ రోవర్ మార్స్‌పై ఉన్న వేరా రూబిన్ రిడ్జ్‌పై ఉంది. ఈ ఉపరితలానికి సంబంధించిన 360 డిగ్రీల పనోరమిక్ వ్యూ ఫొటోను తీసింది. ఆ ఫొటోను పరిశీలిస్తే దుమ్ము తుపాన్ కారణంగా ఆకాశం ఎరుపు రంగులో కనిపిస్తోంది. అలాగే రోవర్ కూడా దుమ్ము పట్టిపోయి కనిపిస్తోంది.