pooja hegde: చార్టెడ్ ఫ్లయిట్ ‌లో ప్రయాణిస్తున్న పూజా హెగ్డే!

  • చేతినిండా ప్రాజెక్టులతో మంచి స్పీడు మీదున్న పూజాహెగ్డే
  • క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బ్యూటీ
  • ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్ కోసం చార్టెడ్ ఫ్లయిట్ ‌లో ప్రయాణం

ఐటెం సాంగ్ తెచ్చిన క్రేజో మరేంటో కానీ పూజా హెగ్డేను వరుస అవకాశాలు వరిస్తున్నాయి. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో అమ్మడు మంచి స్పీడు మీదుంది. 'మహర్షి' సినిమాలో మహేష్ సరసన, 'అరవింద సమేత' సినిమాలో ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రభాస్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ సరసన ‘హౌస్‌ఫుల్ 4’ మూవీలో కూడా నటిస్తోంది. ఇంత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది ఈ బ్యూటీ.

ఇక ఇటీవల నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో 'అరవింద సమేత' చిత్రం కొన్ని రోజులపాటు వాయిదా పడింది. దీంతో అప్పుడు చిత్రీకరించాల్సిన సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒకపక్క ఇక్కడ తన షూటింగ్‌ పూర్తవగానే.. మరోపక్క జైసల్మేర్‌లో జరుగుతున్న ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్ కోసం ఈ చిన్నది చార్టెడ్ ఫ్లయిట్ ‌లో ప్రయాణిస్తోంది. జైసల్మేర్ కి హైదరాబాదు నుంచి విమాన సర్వీసులు అంతగా లేకపోవడం వల్లే, సమయం వృథా కాకూడదన్న ఉద్దేశంతో పూజా ఇలా ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తోందట.

pooja hegde
junior ntr
prabhas
Mahesh Babu
akshay kumar
  • Loading...

More Telugu News