baba sehgal: మహేశ్.. మీ సినిమాలో నాకు ఓ అవకాశం ఇవ్వండి!: బాబా సెహగల్ రిక్వెస్ట్

  • పవన్ కారణంగానే పవర్ సింగర్ బిరుదు
  • ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు
  • మహేశ్ తప్ప అందరితోనూ పనిచేశా

పవన్ కల్యాణ్ కారణంగానే తనకు పవర్ సింగర్ అన్న పేరు వచ్చిందని గాయకుడు బాబా సెహగల్ తెలిపాడు. 'జల్సా' సినిమాలో టైటిల్ సాంగ్ తనకు మంచి ఫేమ్ తీసుకొచ్చిందని చెప్పాడు. తనకు టాలీవుడ్ అంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించాడు. ఈ రోజు హైదరాబాద్ లో ఓ టీవీ చానల్ తో సెహగల్ కొద్దిసేపు మాట్లాడాడు.

తనకు తెలుగు అంతగా రాదనీ, ఎక్కడైనా మాట్లాడాలన్నా, ఈవెంట్స్ లో పాల్గొనాలి అనుకున్నా, చెప్పాల్సిన విషయాన్ని ఓ కాగితంపై రాసుకుని వెళతానని తెలిపాడు. టాలీవుడ్ లో హీరోల పేర్లు తనకు చాలా ఇష్టమన్నాడు. పవన్ కల్యాణ్ పాటలు ఎక్కువగా పాడడం కారణంగానే తనకు పవర్ సింగర్ అనే పేరు వచ్చిందని సెహగల్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్, అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, రవితేజ కోసం పాటలు పాడాననీ, మహేశ్ బాబుకు మాత్రం ఇంతవరకూ పాట పాడలేదని వెల్లడించాడు. ‘మహేశ్ గారూ, నాకు మీ సినిమాలో ఓ అవకాశం ఇవ్వండి’ అని నవ్వుతూ సెహగల్ కోరాడు.

ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ అనీ, సింపుల్ గా ఉంటూ అందరితో కలిసిపోతారని వ్యాఖ్యానించాడు. ప్రభాస్ ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా ‘హలో బాబా.. ఎలా ఉన్నారు?’ అంటూ ప్రేమతో మాట్లాడుతారని చెప్పారు.

baba sehgal
Mahesh Babu
Tollywood
offer
Pawan Kalyan
heros
  • Loading...

More Telugu News