bharath bandh: రేపటి భారత్ బంద్ కు మా మద్దతు లేదు: వైసీపీ నేత మల్లాది విష్ణు

  • ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
  • పెట్రోల్, డీజిల్ పై ఏపీ అత్యధిక పన్ను వసూలు చేస్తోంది
  • టీడీపీ ప్రభుత్వం డ్రామాలాడుతోంది

కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు తలపెట్టనున్న భారత్ బంద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రజలకు పెనుభారంగా మారిందని, ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధిక పన్నులే కారణమని అన్నారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక పన్ను వసూలు చేస్తోందని, ధరలు పెంచిన టీడీపీ ప్రభుత్వమే మళ్లీ నిరసనలు అంటూ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.

bharath bandh
malladi vishnu
  • Loading...

More Telugu News