Sharookh Khan: షారూఖ్, సల్మాన్ లు వియ్యంకులు కావాలి: రాణి ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్య

  • షారూఖ్ వ్యాఖ్యాతగా 'దస్ కా దమ్'
  • చీఫ్ గెస్టులుగా రాణి ముఖర్జీ, సల్మాన్
  • కూతురిని కని అభ్ రామ్ కు ఇవ్వాలన్న రాణి

బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జీ 'దస్ కా దమ్' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షారూఖ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీలు చీఫ్ గెస్టులుగా వచ్చారు. గతంలో ఇద్దరితోనూ కలసి స్క్రీన్ పంచుకుని, సూపర్ హిట్స్ సాధించిన రాణి ముఖర్జీ, సల్మాన్ పెళ్లి ప్రస్తావనకు వచ్చిన వేళ, షారూఖ్, సల్మాన్ లు వియ్యంకులైతే చూడాలని వుందని వ్యాఖ్యానించింది.

పెళ్లి చేసుకోకపోయినా సల్మాన్ ఓ కూతురిని కనాలని, ఆమెను షారూఖ్ కుమారుడు అభ్ రామ్ కు ఇచ్చి పెళ్లి చేయాలని సూచించింది. షారూఖ్ తో ప్రేమ సన్నివేశాలు స్వీట్ గా ఉండేవని, సల్మాన్ తో ప్రేమ తనకెంతో ప్రత్యేకమని తాను హీరోయిన్ గా నటించినప్పటి కాలాన్ని గుర్తు చేసుకుంది.

Sharookh Khan
Salman Khan
Rani Mukharjee
Das ka Dum
  • Loading...

More Telugu News