Telugudesam: ముప్పై ఆరేళ్లుగా పార్టీని కాపాడుతున్న కార్యకర్తలకు పాదాభివందనం: సీఎం చంద్రబాబు

  • తెలంగాణ ఎదగడానికి కారణం నాడు టీడీపీ చేసిన కృషే
  • హైదరాబాద్ అభివృద్ధి కోసం నాడు ప్రపంచమంతా తిరిగా 
  • రాష్ట్ర విభజన తర్వాత నాపై గురుతర బాధ్యత పడింది

ముప్పై ఆరేళ్లుగా పార్టీని కాపాడుతున్న టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో  టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన పిలుపుతో తరలివచ్చిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఈరోజున తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందంటే దానికి కారణం నాడు టీడీపీ చేసిన కృషేనని, హైదరాబాద్ అభివృద్ధి కోసం నాడు ప్రపంచం మొత్తం తిరిగానని అన్నారు. హైదరాబాద్ లో చాలా ప్రాజెక్టులు నాడు తాను ప్రారంభించినవేనని, రాష్ట్ర విభజన తర్వాత తనపై గురుతర బాధ్యత పడిందని అన్నారు. తెలుగుజాతి మధ్య విభేదాలు ఉండకూడదని చెప్పానని, ఇద్దరికీ నష్టం కలగకుండా, ఒప్పించి మాత్రమే విభజన చేయాలని సూచించానని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తరహాలోనే అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు.

Telugudesam
ntr trust bhavan
Chandrababu
  • Loading...

More Telugu News