durga temple: ఇంద్రకీలాద్రి గుడిపై పాము కలకలం.. క్యూలైన్ నిలిపివేసి వెతుకుతున్న సిబ్బంది

  • క్యూలైన్ సమీపంలో దర్శనమిచ్చిన పాము
  • భయాందోళనలకు గురైన భక్తులు
  • రంగంలోకి దిగిన అధికారులు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ రోజు పాము కనిపించడంతో కలకలం చెలరేగింది. ప్రధాన ఆలయానికి వెళ్లే క్యూలైన్ మార్గంలో ఒక్కసారిగా పాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఆలయ సిబ్బంది క్యూలైన్ ను నిలిపివేసి పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆలయ క్యూలైన్ వద్ద కలుగులు ఉండటంతో సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. పాములు పట్టేవారికి అధికారులు సమాచారం అందించారు. మరోపక్క, పాము కనిపించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందుగానే భక్తులను ఆపేశారు. క్యూలైన్ మార్గంలో తవ్వకాలు చేపట్టారు.

durga temple
Andhra Pradesh
snake
  • Loading...

More Telugu News