Yarraballi dayakar rao: కొండా దంపతులు నాకు ప్రత్యర్థులు కాదు: ఎర్రబెల్లి దయాకర్

  • ఆమెకు టికెట్ రాకపోవడానికి, నాకు సంబంధం లేదు
  • ఉనికి కోసమే నన్ను ప్రత్యర్థిగా భావిస్తున్నారు
  • కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది

కొండా సురేఖకు వరంగల్ (ఈస్ట్) పార్టీ టికెట్ రాకపోవడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. గత ఐదేళ్లుగా తాను తన నియోజకవర్గానికే పరిమితం అయ్యానని వెల్లడించారు. ఉనికి కోసమే కొందరు తనను ప్రత్యర్థిగా భావిస్తున్నారని వెల్లడించారు. ఇంటింటికీ ప్రభుత్వం నల్లా కనెక్షన్ ఇవ్వలేదని చెప్పేవారు మూర్ఖులని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని యర్రబెల్లి అన్నారు.

కొండా దంపతులు సహా తనకెవరూ ప్రత్యర్థులు లేరని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను తెలంగాణ కోసం పోరాడాననీ, చంద్రబాబుతో గొడవపెట్టుకుని మరీ ప్రత్యేక తెలంగాణ కోసం టీడీపీ తరఫున లేఖ ఇప్పించానని వెల్లడించారు. ఏ ఎన్నికల్లో పోటీచేసినా ప్రజలు తనను ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న టీడీపీ అసలైన టీడీపీ కాదని దయాకర్ రావు అన్నారు

Yarraballi dayakar rao
TRS
Telugudesam
Telangana
Konda Surekha
  • Loading...

More Telugu News