dasoju shankaramma: టికెట్ వేరే వారికి ఇస్తే.. 10 నిమిషాల్లో ఆత్మహత్య చేసుకుంటా: శ్రీకాంతాచారి తల్లి

  • హుజూర్ నగర్ టికెట్ నాకే ఇవ్వాలి
  • టికెట్ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారు
  • ఇచ్చిన మాటను నిలుపుకుంటారని ఆశిస్తున్నా

తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానానికి పాల్పడి... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి దాసోజు శంకరమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తనను కాదని టీఆర్ఎస్ పార్టీ హుజూర్ నగర్ టికెట్ ను మరొకరికి ఇస్తే... 10 నిమిషాల్లోనే తన ప్రాణం పోతుందని హెచ్చరించారు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. తనకు టికెట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హామీ ఇచ్చారని... ఇచ్చిన మాటను నిలుపుకుంటారని తాను ఆశిస్తున్నానని అన్నారు. మరోవైపు శంకరమ్మకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీరాంజనేయులు, నాగు అనే ఇద్దరు యువకులు హైదరాబాదులోని రేడియో స్టేషన్ టవర్ ఎక్కి నిన్న హల్ చల్ చేశారు.

dasoju shankaramma
sreekantha chary
TRS
ticket
kcr
KTR
  • Loading...

More Telugu News