TRS: టీఆర్ఎస్ లో చేరిన బుల్లితెర నటుడు జేఎల్ శ్రీనివాస్!

  • తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన జేఎల్ శ్రీనివాస్
  • టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానన్న శ్రీనివాస్
  • 60 ఏళ్లలో చేయలేని పనులను నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిందంటూ కితాబు

బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత జేఎల్ శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 30 ఏళ్లుగా తాను ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించానని చెప్పారు. 1969 ఉద్యమంలో కూడా పాల్గొన్నానని... ఖమ్మం జిల్లాకు చెందిన తాను హైదరాబాదులో ఉంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, వాటికి ఆకర్షితుడనై తాను టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తన బృందంతో కలసి టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. పార్టీ తరపున పలు కార్యక్రమాలను కూడా చేపడతానని చెప్పారు. 60 ఏళ్లలో చేయలేని పనులను కేవలం నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసిందని కొనియాడారు. సినీ పరిశ్రమ కోసం ఫిలింనగర్ ఎలా ఉందో... బుల్లి తెర కోసం టీవీనగర్ స్థాపన జరగాలని కోరారు.

TRS
tummala nageswara rao
jl srinivas
actor
  • Loading...

More Telugu News