rave party: రంపచోడవరంలో రేవ్ పార్టీ కలకలం.. 28 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • తూర్పుగోదావరి జిల్లాలోని రెస్టారెంట్ లో ఘటన
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో రేవ్ పార్టీ కలకలం చెలరేగింది. గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడి దేవరాతిగూడెంలోని ఓ రెస్టారెంట్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడిచేశారు. నిర్వాహకుడు సహా 28 మందిని అదుపులోకి తీసుకున్నారు.

దేవరాతిగూడెంలోని ఏ1 రెస్టారెంట్ లో మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకుంటూ మహిళలతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్నఅధికారులు 20 మంది పురుషులు, అసభ్య నృత్యాలు చేస్తున్న ఏడుగురు మహిళలతో పాటు రెస్టారెంట్ నిర్వాహకుడు రమణ మహర్షిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు కార్లతో పాటు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


rave party
East Godavari District
ramacodavaram
  • Error fetching data: Network response was not ok

More Telugu News