venkatesh maha: 'కంచరపాలెం' టీమ్ ను అభినందించిన వెంకటేశ్

  • 'కంచరపాలెం' సినిమా చూశాను 
  • నాకు చాలా బాగా నచ్చింది
  • రానా సమర్పించడం గర్వంగా వుంది  

తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త దర్శకులకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. దాంతో వాళ్లు కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ అభినందనలు అందుకుంటున్నారు. అలా 'కంచరపాలెం' టీమ్ కూడా వెంకటేశ్ నుంచి ప్రశంసలు అందుకుంది. పరుచూరి విజయ ప్రవీణ నిర్మాతగా .. వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపొందిన 'కంచరపాలెం' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన వెంకటేశ్ తన దైన శైలిలో స్పందించారు."ఇది చాలా బ్రిలియంట్ ఫిల్మ్ .. నాకు బాగా నచ్చింది. తెలుగు సినిమాను సరికొత్త మార్గంలో ఈ సినిమా నడిపిస్తుందని అనిపిస్తోంది. ప్రేక్షకులపై ఈ సినిమా మంచి ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నాను. ఇంతమంచి సినిమాను రానా సమర్పించడం నాకు చాలా గర్వంగా వుంది" అంటూ దర్శక నిర్మాతలకు .. నటీనటులకు ఆయన ప్రశంసలు అందజేశారు.  

venkatesh maha
  • Loading...

More Telugu News