Supreme Court: న్యాయవ్యవస్థ తన పని తాను చేసింది.. మన పని మనం చేద్దాం: ఆమిర్ ఖాన్

  • 158 సెక్షన్‌కు ముగింపు పలికిన సుప్రీంకోర్టు
  • కొందరికి ఇది చారిత్రాత్మక రోజన్న నటుడు
  • కోర్టు తీర్పుకు మద్దతు

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ స్పందించాడు. ‘అసహజ శృంగారమే’ అయినప్పటికీ.. పరస్పర అంగీకారంతో చేస్తే తప్పేమీ లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత వ్యవహారమని, దీని వల్ల ఎవరికీ హాని జరగదని పేర్కొంది.158 ఏళ్లుగా అమలులో ఉన్న 377 సెక్షన్‌ రద్దు చేసింది. ఈ సెక్షన్‌లోని ఇతర నిబంధనల ప్రకారం.. జంతువులు, పిల్లలతో జరిపే బలవంతపు శృంగారాన్ని మాత్రమే నేరంగా పరిగణించాలని సుప్రీం ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.

ఈ తీర్పుపై స్పందించిన నటుడు ఆమిర్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. న్యాయ వ్యవస్థ తన పని తాను చేసిందని, ఇప్పుడు మనం మన పనిని చేయాలని పేర్కొన్నాడు. అందరికీ సమాన హక్కుల కోసం పోరాడుతున్న వారికి ఇదో చారిత్రాత్మక రోజని పేర్కొన్నాడు. సుప్రీం తీర్పుకు తన మద్దతు తెలిపాడు.

  • Loading...

More Telugu News