TRS: అసంతృప్త నేతలను బుజ్జగించాల్సిన బాధ్యత మీదే: టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్

  • టికెట్ వచ్చిందని గర్వపడొద్దు
  • రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలి
  • నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోవాలి

వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు 105 మందితో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. టికెట్ వచ్చిందని గర్వపడొద్దని, రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, నియోజకవర్గంలోని అన్ని స్థాయుల నేతలను కలుపుకొని పోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అసంతృప్త నేతలను బుజ్జగించాల్సిన బాధ్యత ఆయా అభ్యర్థులదేనని సూచించారు. ప్రతీ నియోజకవర్గానికి వస్తానని, ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని, ప్రచారంలో అలసత్వం ప్రదర్శిస్తే, తనకు సమాచారం వస్తుందని హెచ్చరించారు. ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తానని వారితో కేసీఆర్ అన్నట్టు సమాచారం. కాగా, పదిహేను రోజుల తర్వాత జిల్లాల వారీగా కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

TRS
105 candidates
  • Loading...

More Telugu News