kcr: 2.30 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం.. క్లారిటీ ఇవ్వనున్న సీఎం

  • ప్రగతి భవన్ లో బిజీబిజీగా కేసీఆర్
  • ఒంటి గంటకు కేబినెట్ సమావేశం
  • మీడియా సమావేశంలో ముందస్తుకు సంబంధించి కీలక ప్రకటన

ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లోనే కేబినెట్ సమావేశం జరగనుంది. దీని తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడించనున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఈ సందర్భంగా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

kcr
pragathi bhavan
elections
press meet
  • Loading...

More Telugu News