economic times: కేసీఆర్ ను అవార్డుకు ఎంపిక చేయడం సంతోషం కలిగించింది: కేటీఆర్

  • ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపికైన కేసీఆర్
  • అవార్డుల కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారన్న కేటీఆర్
  • అవార్డుకు ఎంపిక చేయడంపై ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను 'ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్' అవార్డుకు ఎంపిక చేసింది. ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేసీఆర్ కు ఈ అవార్డును అందజేయనుంది. కేసీఆర్ అవార్డుకు ఎంపిక కావడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తెలంగాణ సీఎంను ఎంపిక చేయడం ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవానికి కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. మరోవైపు, బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

economic times
business reformer award
kcr
KTR
  • Loading...

More Telugu News