Blue whale Game: ఇంజినీర్ ప్రాణం తీసిన బ్లూవేల్ గేమ్.. ఒత్తిడి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య!

  • బ్లూవేల్ ఆడి మానసిక ఒత్తిడికి గురైన ఇంజినీర్
  • ఆఫీసు నుంచి ఇంటికొచ్చి ఆత్మహత్య
  • తమిళనాడులో ఘటన

ప్రపంచాన్ని భయపెట్టిన బ్లూవేల్ గేమ్‌కు మరొకరు బలయ్యారు. ఈ ఆట ఆడిన తమిళనాడుకు చెందిన ఇంజినీర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాష్ట్రంలోని కడలూరు పన్రూట్టిలోని అంగుచెట్టిపాళయానికి చెందిన శేషాద్రి (22) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పుదుచ్చేరి మెట్టుపాళయంలోని ఓ ప్రవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి యథావిధిగా విధులు ముగించుకుని ఇంటికొచ్చిన ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు శేషాద్రి ఇంటికి చేరుకుని అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు అతడి గదిని పరిశీలిస్తుండగా దెయ్యాల కథల పుస్తకాలు కనిపించాయి. దీంతో అతడి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా బ్లూవేల్ గేమ్ ఆడినట్టు తేలింది. ఆ గేమ్‌లో మానసిక ఒత్తిడి కారణంగానే అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Blue whale Game
Engineer
Suicide
Tamilnadu
  • Loading...

More Telugu News