dilip kumar: సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కు అస్వస్థత!

  • దిలీప్ కుమార్ కు ఛాతి ఇన్ఫెక్షన్  
  • ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స
  • దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ లో ప్రకటన

బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేయాలని ఆ ట్వీట్ లో కోరారు.

కాగా, దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసుప్ ఖాన్. 1922 డిసెంబర్ 11న జన్మించారు. మొగల్-ఏ-అజమ్, నవ్యదౌర్, దేవదాస్, గంగా జమునా, కర్మ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దిలీప్ కుమార్ ఏర్పరచుకున్నారు. ‘ట్రాజెడీ కింగ్’ గా పేరు సంపాదించుకున్న దిలీప్ కుమార్ 1998 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.1994లో దాదా సాహెబ్ ఫాల్కే, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో దిలీప్ కుమార్ ని ప్రభుత్వం గౌరవించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News