surendra kumar das: ఆత్మహత్యకు యత్నించిన మరో ఐపీఎస్ అధికారి.. పరిస్థితి విషమం!

  • తూర్పు కాన్పూర్ ఎస్పీగా పని చేస్తున్న సురేంద్ర
  • విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఎస్పీ 
  • కుటుంబ కలహాలే కారణం

అఖిల భారత సర్వీస్ అధికారులు సైతం వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఎస్పీ సురేంద్ర కుమార్ దాస్ విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. హుటాహుటిన ఆయనను స్థానిక రెజెన్సీ ఆసుపత్రిలో చేర్చగా... ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కుటంబ కలహాలే ఈ ఘటనకు కారణం కావచ్చని ఎస్ఎస్పీ సంజీవ్ సుమన్ చెప్పారు. లక్నోకు చెందిన సురేంద్ర కుమార్ 2014 ఐపీఎస్ బ్యాచ్ కు చెందినవారు. తూర్పు కాన్పూర్ ఎస్పీగా ప్రస్తుతం పని చేస్తున్నారు. 

surendra kumar das
ips
suicide attempt
kanpur
sp
  • Loading...

More Telugu News