KTR: శుక్రవారం కల్లా మీరు మాజీలైపోతారు... ఎమ్మెల్యేలకు షాకిచ్చిన కేటీఆర్

  • అసెంబ్లీ రద్దు విషయంపై స్పష్టతను ఇచ్చిన కేటీఆర్
  • కేటీఆర్ ను కలసిన కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • మళ్లీ శుక్రవారం కలుస్తామన్న ఎమ్మెల్యేలు.. అప్పటికి మాజీలయిపోతారన్న కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తో నిన్న సాయంత్రం టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కాసేపు ఆయనతో ముచ్చటించిన తర్వాత మళ్లీ శుక్రవారం నాడు కలుస్తామంటూ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు చెప్పారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ, శుక్రవారం కల్లా మీరు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారని చెప్పారు. కేసీఆర్ మాటలతో ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. ఏం జరగబోతోందో వారికి పూర్తిగా అర్థమయిపోయింది.

అసెంబ్లీని ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయబోతున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఏ ఒక్కరూ ఇంత వరకు స్పందించనప్పటికీ... కేటీఆర్ మాటలతో అసెంబ్లీ రద్దు అవబోతోందనే విషయం స్పష్టమయింది. రేపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

KTR
TRS
assembly
disolve
  • Loading...

More Telugu News