KTR: అదే జరిగి ఉంటే... పాలమూరు జిల్లా మరో కోనసీమ అయి ఉండేది!: కేటీఆర్

  • కేసీఆర్ లాంటి సీఎం కావాలని ఆంధ్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు
  • సమైక్యాంధ్రలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయింది
  • దేశమంతా టీఆర్ఎస్ ను ప్రశంసిస్తోంది

పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు నీళ్లిస్తుంటే కాంగ్రెస్ నేతలు భరించలేకపోతున్నారని మిమర్శించారు. సమైక్యాంధ్రలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. కేసీఆర్ పాలనను చూసిన ఆంధ్ర ప్రజలు... ఏపీలో కూడా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. షాద్ నగర్ లో మున్సిపాలిటీ భవన నిర్మాణానికి, ఆడిటోరియం నిర్మాణానికి, 1700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈరోజు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, దేశమంతా తెలంగాణను ప్రశంసిస్తోందని చెప్పారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ద్వారా పూర్వపు పాలమూరు, కొంత నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చేలా నాటి నిజాం రూపకల్పన చేశారని... ఆ సమయంలో తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలపడం వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే పాలమూరు మరో కోనసీమ అయి ఉండేదని చెప్పారు. కాంగ్రెస్ నేతల వల్లే పాలమూరు జిల్లా నాశనమయిందని మండిపడ్డారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News