Allu Arjun: వక్కంతం వంశీని వదిలేయని బన్నీ!

  • వక్కంతం వంశీకి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన బన్నీ 
  • హిట్ కొట్టలేకపోయిన వక్కంతం 
  • అయినా ఆయనపై నమ్మకం ఉంచిన బన్నీ

సినీ కథా రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరుంది. ఆయన కథలతో రూపొందిన కొన్ని సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడిగా మారాలని నిర్ణయించుకోవడంతో, 'నా పేరు సూర్య' సినిమాతో బన్నీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ తన ముచ్చటైతే తీర్చుకున్నాడు గానీ .. విజయాన్ని అందుకోలేకపోయాడు. 'నా పేరు సూర్య' పరాజయంపాలు కావడం వలన, వక్కంతం వంశీని బన్నీ పట్టించుకోడని కొంతమంది అనుకున్నారు. కానీ ఆయన వక్కంతం వంశీతో గల సాన్నిహిత్యాన్ని వదులుకోలేదని తెలుస్తోంది. కథా కథనాలపై వక్కంతం వంశీకి మంచి పట్టు ఉందని గ్రహించిన బన్నీ, ఆయనకి ఒక బాధ్యతను అప్పగించినట్టుగా సమాచారం. విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయనున్న బన్నీ, ఆ కథలో వినోదం పాళ్లు తక్కువగా ఉన్నాయని భావించాడట. ఆ లోపాన్ని భర్తీ చేసే బాధ్యతను వక్కంతం వంశీకి అప్పగించాడనీ .. ఆ కథపై ఆయన కసరత్తు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.  

Allu Arjun
vakkantham
  • Loading...

More Telugu News