Madhya Pradesh: కాపాడాలని 20 నిమిషాలు వేడుకున్నా కనికరించని జనం.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి!

  • మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఘటన
  • బైకును ఢీకొట్టిన కారు
  • సాయం కోసం ముందుకు రాని జనం

మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన భార్యను రక్షించాలని ఆమె భర్త రోడ్డుపై వెళుతున్న ప్రతీ వాహనదారుడిని బ్రతిమాలాడు. కానీ ఏ ఒక్కరూ కనికరించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మధ్యప్రదేశ్ కు చెందిన సుధీర్ వర్మ భార్య నేహా, కుమార్తె మాహీలతో కలసి ఇండోర్ నుంచి ఉజ్జయినికి బైక్ పై బయలుదేరారు. దారిలో సంవేర్ రోడ్డుపై వీరి బైక్ ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నేహా తీవ్రంగా గాయపడింది. దీంతో భార్యను ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేయాల్సిందిగా ఆ దారిన వెళ్లే వాహనదారులను సుధీర్ బ్రతిమాలాడు.

 కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరికి అంబులెన్సుకు ఫోన్ చేయగా, 20 నిమిషాల తర్వాత వచ్చింది. బాధితురాలిని అందులో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారి మాహీ, తండ్రి సుధీర్ లు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Madhya Pradesh
UJJAINI
Road Accident
  • Loading...

More Telugu News