vijay devarakonda: మారుతి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ

  • వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ
  • యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా 
  • 2019లో సెట్స్ పైకి  

యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే ఆయనతో సినిమాలు చేయడానికి పూరి జగన్నాథ్ సైతం ఆసక్తిని చూపుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉండగా, మూడు సినిమాలు సెట్స్ పైకి వెళ్లే పనుల్లో వున్నాయి.

అయితే ఈ మూడు సినిమాల్లో ఒకటి మారుతి దర్శకత్వంలో రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మారుతి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శైలజా రెడ్డి అల్లుడు' రెడీ అవుతోంది. ఆ తరువాత ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండను ఖరారు చేసినట్టుగా సమాచారం. 2019 ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. 

  • Loading...

More Telugu News