KCR: తెలంగాణ అసెంబ్లీ రద్దు ముహూర్తం 6న ఉదయం 6.45... ఇదే కేసీఆర్ జాతకబలం!

  • అసెంబ్లీ రద్దుకు పావులు కదుపుతున్న కేసీఆర్
  • ముహూర్తం 6.45గా నిర్ణయించడం వెనుక జ్యోతిష్యుల సలహా
  • చకచకా మారిపోతున్న తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. రేపు ఉదయం 6.45 గంటలకు అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉదయం పూట సమయాన్ని ఎంచుకోవడం వెనుక పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ జాతక బలాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య దివ్యంగా ఉందని చెప్పారట. రేపు ఆ సమయంలో ఏకాదశి, సింహలగ్నం. కేసీఆర్ కు అనుకూలించే సంఖ్య 6. ఏ రకంగా చూసినా 6 అనే అంకె కలిసొచ్చేలా ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయన నక్షత్ర, రాశులకు అనుకూలంగా గ్రహస్థితులు బాగున్నాయని పండితులు వెల్లడించినట్టు సమాచారం.

ఉదయం 6.45... ఈ మూడు అంకెలనూ కూడితే 15 వస్తుంది. దాన్ని కూడితే ఆరు వస్తుంది. రేపు తేదీ 6-9-18... కూడితే 24 వస్తుంది. ఈ రెండు అంకెలను కూడినా వచ్చేది ఆరే. ఆరు అనే అంకెకు, కేసీఆర్ జాతకరీత్యా ఉన్న బలానికీ జోడీ గట్టిగా ఉందని భావించిన పండితులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

KCR
Telangana
Elections
Assembly
Cabinet
  • Loading...

More Telugu News