kcr: కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం: కేంద్ర మంత్రి అథవాలే

  • వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
  • తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి  
  • ప్రజల కోసం కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారు

తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ చెబుతున్న తరుణంలో కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలవడం, కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని అన్నారు.

 కామారెడ్డిలో ఈరోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పేదలకు, రైతులకు, దళితులకు, మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో పాటుపడుతున్నారని ప్రశంసించారు.

kcr
ramdas athwale
  • Loading...

More Telugu News