kamal: 'భారతీయుడు 2'లోను కమల్ ద్విపాత్రాభినయం?

- కమల్ హీరోగా 'భారతీయుడు 2'
- కీలకమైన పాత్రలో అజయ్ దేవగణ్
- కథానాయికగా తెరపైకి నయన్ పేరు
దర్శకుడిగా శంకర్ కెరియర్లోనూ .. కథానాయకుడిగా కమల్ కెరియర్లోను చెప్పుకోదగిన సినిమాగా 'భారతీయుడు' నిలిచింది. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కమల్ ద్విపాత్రాభినయం చేశాడు. సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి శంకర్ రంగంలోకి దిగాడు. ఈ సినిమాలోను కమల్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం.
