hardik patel: 11వ రోజుకు చేరిన నిరాహార దీక్ష.. 20 కేజీలు తగ్గిన హార్ధిక్ పటేల్

  • హార్దిక్ కు క్షీణిస్తున్న ఆరోగ్యం
  • మెడికల్ చెకప్ కు నిరాకరిస్తున్న హార్ధిక్ 
  • జోక్యం చేసుకోని రాష్ట్ర ప్రభుత్వం

పటేళ్లకు ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో కోటా కోరుతూ పటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ చేపట్టిన నిరాహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది. నిరాహార దీక్షకు దిగినప్పుడు 78 కేజీల బరువున్న హార్ధిక్ ఇప్పటికి 20 కేజీల బరువు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు. ఓ వైపు ఆయన ఆరోగ్యం క్షిణిస్తున్నప్పటికీ రాష్ట్ర బీజేపీ సర్కార్ ఈ అంశంలో ఇంత వరకు జోక్యం చేసుకోలేదు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 'ఐసీయూ ఆన్ వీల్స్'ను దీక్షా వేదిక వద్ద సిద్ధంగా ఉంచారు. మరోవైపు మెడికల్ చెకప్ కు కూడా హార్ధిక్ పటేల్ నిరాకరిస్తున్నారు. తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను పోలీసులు వేధిస్తున్నారని... వేధింపులు ఆగిపోయేంత వరకు వైద్యులను అనుమతించనని ఆయన స్పష్టం చేశారు.

హార్ధిక్ పటేల్ కు కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు ఆయనను పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా రానున్నారు. ఇప్పటికే మోదీ పాలనను పలు సందర్భాల్లో సిన్హా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News