venkatesh: వెంకటేశ్ .. దుల్కర్ హీరోలుగా మల్టీస్టారర్

- 'ఎఫ్ 2' మూవీ చేస్తోన్న వెంకటేశ్
- 'జోయా ఫ్యాక్టర్'తో బిజీగా దుల్కర్
- త్వరలో ఈ కాంబినేషన్లో మూవీ
తెలుగులో ఒక వైపున బయోపిక్ ల హవా కొనసాగుతూ ఉంటే, మరో వైపున మల్టీ స్టారర్ ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. వార్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఆల్రెడీ దర్శక నిర్మాతలు ఈ ఇద్దరినీ కలిసి కథ చెప్పడం .. వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని అంటున్నారు.
