rakul preet singh: ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి నేనే తప్పుకుంటా: రకుల్ ప్రీత్ సింగ్

  • జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు
  • ఈ రోజు ఉన్న ఫేమ్ రేపు ఉండకపోవచ్చు
  • పరుగు ఎప్పుడు ఆపాలో నాకు తెలుసు

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగినవారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. దాదాపు అగ్ర నటులందరి సరసన రకుల్ నటించి, అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది. అయితే, గత కొంత కాలంగా ఈ పంజాబీ భామకు అవకాశాలు తగ్గాయి.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పింది. ఈ రోజు ఉన్న ఫేమ్, రేపు ఉండకపోవచ్చని తెలిపింది. వాస్తవాలను ఒప్పుకుంటే ఎలాంటి భయాలు ఉండవని చెప్పింది. తనకు పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసని... ప్రేక్షకులకు తాను బోర్ కొడుతున్నానని అనిపించినప్పుడు తనంతట తానే ఇండస్ట్రీకి దూరమవుతానని తెలిపింది.

rakul preet singh
tollywood
  • Loading...

More Telugu News