telangana: అసెంబ్లీ రద్దు వార్తకు ఊపు.. గవర్నర్ తో సీఎస్, అసెంబ్లీ కార్యదర్శి భేటీ

  • అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల దిశగా కీలక పరిణామాలు
  • నరసింహన్ తో అధికారుల కీలక సమావేశం
  • సెక్రటేరియట్ లో కూడా సమావేశం నిర్వహించిన అధికారులు

తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఫామ్ హౌస్ లో ఇదే విషయంపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు గవర్నర్ నరసింహన్ తో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింగరావులు భేటీ అయ్యారు. దీనికి ముందు సెక్రటేరియట్ లో అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ రద్దు వార్తల నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం జరగనున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

telangana
elections
governor
chief secretary
assebly
narasimhan
meeting
  • Loading...

More Telugu News