balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ లో 'జయప్రద' పాత్ర గురించి రాశి ఖన్నా

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
  • హైదరాబాదులో అసెంబ్లీ సన్నివేశాలు
  • ముఖ్య పాత్రల్లో రానా .. రకుల్

క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోంది. ఇటీవలే అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే నిన్న హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక శ్రీదేవి పాత్రలో రకుల్ ను తీసుకున్నారు .. ఈ విషయాన్ని రకుల్ కూడా కన్ఫర్మ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే 'జయప్రద' పాత్రలో రాశి ఖన్నా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ విషయమై రాశి ఖన్నా స్పందిస్తూ .. ఇంతవరకూ ఈ పాత్ర విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేసింది. తన నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండ జోడీగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పింది. ఈ పాత్ర తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  

balakrishna
rakul
rasi khanna
  • Loading...

More Telugu News